Home > Movies > రామ్ చరణ్ తో బాలీవుడ్ హీరో ఫైట్

రామ్ చరణ్ తో బాలీవుడ్ హీరో ఫైట్

సల్మాన్ టాప్
చిరంజీవి 4ల‌క్ష‌లు ఆర్ధిక‌ స‌హాయం

ramcharan-vivek-oberoi-apduniaమెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌… మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది జనవరి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో చరణ్‌కి విలన్‌గా బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘రక్తచరిత్ర’ చిత్రంలో పరిటాల రవి రోల్ లో అదరగొట్టిన వివేక్‌ తెలుగును ఫిదా చేశాడు . ఆ తర్వాత అజిత్‌ నటించిన ‘వివేగం’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మరోసారి ఆకట్టుకున్నాడు. మరోవైపు ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో పోషించనున్నట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం చెర్రీ సుకుమమార్ డైరెక్షన్ రూపుదిద్దుకుంటున్న ‘రంగస్థలం’ చిత్రంతో బిజీ ఉన్నాడు. సమంత హీరోయిన్ గా చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బోయాపాటి సినిమాతో పాటు ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ లో నటించనున్నాడు. ఈ మూవీలో చెర్రీతో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com