Home > Editorial > ములాయాం పరివార్….

ములాయాం పరివార్….

సుప్రీం తీర్పుతో నైనా మార్పు వచ్చేనా...

akhilesh-mulayamsingh-apduniaఉత్తర ప్రదేశ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబ కలహం తెగ తెంపుల అంచులవరకూ పోయింది. డైలీ సీరియల్ లో రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. కలసి ఉంటే కలదు అధికారం… అన్న సామెతను గుర్తు చేసుకుని యాదవ వీరులు దూసిన కత్తులు దూసుకుంటున్నారు. తండ్రీ కొడుకులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య రాజీ కుది ర్చేందుకు అజంఖాన్‌ పెద్ద రాయబారమే నడిపిన..ముణ్ణాళ్ల ముచ్చటగా మారింది. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తనకు పెద్ద పీట వేయడంతో సంబరపడిన శివపాల్‌ యాదవ్‌ను రెండు రోజులుగా నడిచిన నాటకం క్లైమాక్స్ నిరాశ, నిస్పృహలకు గురి చేసి ఉండవచ్చు.రాజకీయాలలో రాటుదేలిన వృద్ధ సింహం ములాయం సింగ్‌ యాదవ్‌. గతంలో ఎన్నో తుపానులను, సునామీలను ఎదుర్కొన్నారు. ములాయం సింగ్‌ పని ముగిసిపోయిందని రాజకీయ వేత్తలు, మీడియా కోడై కూసిన నాడు భయపడలేదు. మల్లయోధుడుగా జీవితం ప్రారంభించి రాజకీయాల్లో రాణిం చిన ములాయం అంత సులభంగా ఓటమిని అంగీకరించ… బోరని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. 70వ దశకంలో రామ్‌ మనోహర్‌ లోహియా సిద్ధాంతాల కు ఆకర్షితులై రాజకీయాల్లోకి వచ్చినా, ములాయం చౌదరీ చరణ్‌ సింగ్‌ వద్దే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఎమర్జెన్సీ తరువాత జనతాపార్టీ హయాం లో తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. తన రాజకీయ గురువు చరణ్‌ సింగ్‌ మరణంతో రాజకీయ శూన్యత ఎదుర్కొన్నారు. చరణ్‌ సింగ్‌ వారసుడి గా అజిత్‌ సింగ్‌ రాజకీయాలలోకి వచ్చినా, అజిత్‌ను అనుసరించకుండా తనదైన శైలిలో రాజకీయం నడిపారు. ఓబీసీలు, ముస్లింలు, కులలను కలుపు కుని బలమైన నాయకుడిగా ఎదిగారు. అగ్ర కులస్థులు జ్ఞానేశ్వర్‌ మిశ్రా, కపిల్‌ దేవ్‌ సింగ్‌ వంటివారిని, బేణి ప్రసాద్‌ వర్మ, అజం ఖాన్‌ వంటివారం దరినీ కలుపుకుని కదిలారు. 1987లో విపి సింగ్‌ రాజీవ్‌ గాంధీపై తిరుగుబా టు చేసినప్పుడు యూపీలో నాయకుడిగా ప్రథమ శ్రేణిలో నిలిచారు. 1989లో అజిత్‌ సింగ్‌ను అధిగ మిస్తూ ముఖ్యమంత్రి పీఠం దక్కిం చుకున్నారు.90వ దశకంలో బాబ్రి మసీద్‌పై దాడి చేస్తున్న కరసేవకు లపై కాల్పులు జరిపేందుకు ఆదేశించడం ద్వారా కాలపరీక్షకు నిలిచారు. మౌలానా ములాయంగా పేరుపడ్డా, 1993లో బిఎస్‌పితో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభు త్వంలో ప్రధాని అయ్యే ఛాన్‌‌స కొద్దిలో తప్పిపోయింది. అయినా యూపీ ముఖ్యమంత్రిగా రాణించారు. అలాంటి రాజకీయ అనుభవం ఈ నాడు ఎంతో ఉపయోగపడింది. కుటుంబ కలహాలు, 2017 అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా పార్టీ విజయావకాశాలను నాశనం చేసే పరిస్థితికి దారి తీయవచ్చు నన్న స్థితిలో వెనక్కి తగ్గారు. గతంలోనూ సమాజ్‌వాదీ పార్టీలో కొద్ది నెలలు గా సాగుతున్న అంతర్గత కలహం ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, అతడి బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ మధ్య సాగుతున్న ప్రచ్ఛ న్న యుద్ధం పార్టీ ప్రతిష్ఠను దిగజార్చింది. ముఖ్యమంత్రిగా అఖిలేశ్‌ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, ఒక దశలో ప్రభుత్వం నిర్ణయాలలో తన తండ్రి జోక్యాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ములాయం సింగ్‌ అహంభావాన్ని దెబ్బ తీసే స్థితికి చేరింది. అదే నేపథ్యంలో సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ఎస్‌పి ఉత్తరప్రదేశ్‌ అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ను తప్పించి, తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌కు కట్ట పెట్టడంతో యాదవ కుటుంబంలో చిచ్చు రగిలింది. దీంతో ముఖ్యమంత్రి హోదాలో అఖిలేశ్‌ తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న శివపాల్‌ యాదవ్‌, మరికొంద రిపై వేటు వేశారు. ములాయం పార్టీపై సోదరుడికి ఉన్న పట్టు తెలిసి, అతడిని వెనకేసుకుని రావడం ముఖ్యమంత్రి అఖిలేశ్‌ అహాన్ని దెబ్బ తీసింది. తన సీనియారిటీ కాదని 2012లో అఖిలేశ్‌ను ములాయం ముఖ్యమంత్రిని చేశారు. ఆ దుగ్ధతో ఉన్న శివపాల్‌ తనదైన రాజ కీయం నడిపాడు. అఖిలేశ్‌ రాజధానిలో లేని సమయంలో ములాయం సింగ్‌ తో 325 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేయించడం, అఖిలేశ్‌ యాదవ్‌ తో సహా ఆయన అనుయాయులను పక్కన పెట్టడంతో ఒక్కసారిగా ఆగ్రహావే శాలు పెల్లుబికాయి. పార్టీ అధి నాయకుడు, తన తండ్రి ములాయం సింగ్‌తో చర్చించి సమస్య పరిష్కరిస్తామని తన అనుయాయులకు సర్ది చెబుతూ వచ్చారు. కానీ, ములాయం సింగ్‌ వెనుకంజ వేయకపోవడంతో పరిస్థితి చేయి జారింది. తన అనుయాయులతో కూడిన 235 మంది అభ్యర్థుల కొత్త జాబితా ప్రకటించి నాయకత్వానికి సవాల్‌ విసిరారు. అదే సమయంలో ములాయం సింగ్‌ యాదవ్‌, శివపాల్‌ యాదవ్‌ ఏకంగా ముఖ్యమంత్రికి, మరో సోదరుడు రామ్‌ గోపాల్‌ యాదవ్‌ కు షో కాజ్‌ నోటీసు జారీచేయడం, కొద్ది గంటల్లోనే అఖిలేశ్‌ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో సమాజ్‌వాదీ పార్టీ చీలిక ఘట్టం కై్లమాక్‌‌స చేరింది. అఖిలేశ్‌ యాదవ్‌ దెబ్బ తిన్న పులిలా బల ప్రదర్శనకు పూనుకున్నారు. ఆయన పక్షాన ఏకంగా 175 మంది ఎమ్మెల్యేలతో పాటు 200 మందికి పైగా సీనియర్‌ నాయకులు సమావేశం కావడం, ములాయం సింగ్‌ యాదవ్‌ కార్యాలయం ఎదుట 60 కంటే తక్కువ ఎమ్మెల్యేలు గుమికూడడంతో ముఖ్యమంత్రి అఖి లేశ్‌ సత్తా బయటపడింది. కానీ ఆదివారం జరిగిన పరిణామాలు మాత్రం..ములాయం సింగ్ యాదవ్ ను ఇరుకున పెట్టే విధంగానే ఉన్నాయి. పార్టీ గొడవ చివరికి ఎన్నికల సంఘం గుమ్మం తొక్కాల్సిన పరిస్థితికి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *