Home > Politics > హస్తంలో వార్

హస్తంలో వార్

బీజేపీ వాయిస్ మారుతోందా....
నగరిలో ఫ్యామిలీ ‘గాలి’

congress-apduniaగత ఎన్నికల్లో ఘోర పరాభావం చవిచూసినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీరు మారకపోగా.. అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటి వరకు ఆత్మ విమర్శ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు సైతం మొదలు పెట్టనే లేదు. అధికార పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎదురుదాడి చేయలేక వెనుకబడి పోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నేత లు మూడు గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఆరాట పడుతూ గందరగోళ పరిస్థితులకు తెర లేపుతున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు కలవర పడుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న అభిప్రాయ బేధాలు అంతర్గత కుమ్ములాటల కారణంగా కొద్దోగొప్పో మిగిలి పోయిన కార్యకర్తలు కూడా అయోమయానికి లోనవుతూ అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.

జిల్లాలో పార్టీని పటిష్ట పరిచేందుకు అధిష్ఠానం సీరియస్ గా దృష్టి సారిస్తున్న నేతల మధ్య ఐక్యత లేక పోవడంతో మూడు ముక్కలాటను తలపిస్తుంది. జిల్లా విభజన జరిగి యేడాది గడిచి పోతున్న ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగక పోవడం.. ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నిం పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జైనథ్‌ మండల కేంద్రంలో పల్లె పల్లెకు కాంగ్రెస్‌ పార్టీ జెండా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఓ వర్గమే నాయకత్వం వహిస్తుండడంతో మరో రెండు వర్గాల నేతలు ఆగ్రహాంతో రగిలి పోతున్నారు. గతంలో ఇరు వర్గాల నేతలు అధిష్ఠానం పెద్దల ముందే కుమ్ములాడుకున్న విషయం తెలిసిందే. ఇకనైనా నేతల మధ్య ఐక్యత కుదిరి ప్రజల్లోకి పార్టీని ఏ మేరకు తీసుకెళ్తారో వేచి చూడాల్సిందే.

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ చుట్టు అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి.ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్న విభేధాలు మూ డు ముక్కలాటను తలపిస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నారు. సీనియర్‌ నాయకులు మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి వర్గంతో పాటు ఆదిలాబాద్‌ నియోజక ఇన్‌చార్జీ భార్గవ్‌ దేశ్‌పాండేలు చేరో వర్గానికి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. అలాగే మహిళ నేత అయిన గండ్రత్‌ సుజాత కూడా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ తనదైన శైలీలో ముందుకు సాగుతున్నారు. ప్రభు త్వ వ్యతిరేక కార్యక్రమాలను కూడా మూడు వర్గాలు విడి విడిగానే నిర్వహించడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలం గా మారుతుంది. బోథ్‌ నియోజక వర్గ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న అనిల్‌ జాదవ్‌ ఎలాంటి వర్గ విభేధాలు లేకుండా అందరి తో కలిసి పోతున్నట్లు ప్రచారం సాగుతుంది.
ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఓటమి నుంచి నేతలు గుణపాఠం నేర్చుకోవడం లేదంటున్నారు. ఇప్పటికి కూడా నేతల మధ్య ఐక్యత భావం కనిపించడం లేదు. మండల, గ్రామస్థాయి నాయకత్వంకూడా వర్గాలుగా విడి పోయి పార్టీ కోసం పని చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలను అధికార టీఆర్‌ఎ్‌సపార్టీ సీరియస్ గా గమనిస్తూ గ్రామస్థాయి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. తరుచూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహి స్తూ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *