Home > Politics > బీజేపీకి వ్యతిరేకం కాదు : సీఎం చంద్రబాబు

బీజేపీకి వ్యతిరేకం కాదు : సీఎం చంద్రబాబు

మున్సిపల్ అన్నీ ఆన్ లైనే
‘జన్మభూమి’ రాష్ట్ర స్థాయి అవార్డులు

chandrababunaidu-apduniaపరిష్కారం కాని సమస్యలపై కోర్టుకెళ్తామన్న తన వ్యాఖ్యలను బీజేపీకి వ్యతిరేకంగా భావించకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. విభజన సమస్యలపై కోర్టుకెళ్లే అంశాన్నిశనివారం అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఆయన ప్రస్తావించారు. హామీల సాధన కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకోవటం మనకున్న హక్కు.. దీనిని కొందరు బీజేపీపై పోరాటంగా చిత్రీకరించడం తగదని అన్నారు. మనకు ఉన్న హక్కును వినియోగించుకుంటే తప్పేముందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగానే తాను వ్యాఖ్యలు చేశానంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని కలిశాక హామీల అమలుపై స్పష్టత కనిపించిందని చెప్పారు. పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని, సమస్యలు పరిష్కారం అయ్యే వాతావరణం ప్రధానితో భేటీ అనంతరం తనకు కలిగిందని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ టీడీపీ, జన్మభూమి కార్యక్రమం సరిగా జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలంటూ కొందరు నేతలకు ఆయన ఈ సందర్భంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *