Home > Bhakti > ప్రమిధల విశిష్టత

ప్రమిధల విశిష్టత

మహాంకాళికి ప్రత్యేక హారతి
చూడ ముచ్చటగా రాములోరి క్షేత్రం

pramida-apduniaభారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య కాంతుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. చీకటిని తోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా ప్రమిదలలో దీపాలు వెలిగించే దీపావళికి, పలు దీపారాధనలకు మట్టి ప్రమిధలకు ఎంతో విశష్టత వుంది..

దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలకు.ఆలయాలకు మరికొంత సోయగాల అలంకారానిస్తూన్నాయి దీప ప్రమిదలు. పట్టణాలు, పల్లెలోనూ వివిధ ఆకృతుల మట్టి ప్రమిదలు సందడి చేస్తూన్నాయి. అనేక రకాల ఆకృతులలో లభ్యమౌతున్న మట్టి ప్రమిదలు చూపరుల మనసు దోస్తున్నాయి. దీపావళి, కార్తీక మాసాలలో దీపారాధనలకు విశిష్ట ప్రాముఖ్యత కలిగిన మట్టి ప్రమిదలు వివిధ రకాలలో అందుబాటులోకి రావటంతో పలువురు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు . స్థానికంగానే కాదు, రాజస్తాన్, కేరళ మరియు డిల్లీ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన వివిధ రకాల ఈ మట్టి ప్రమిదలను గృహిణులు ఎంతో మక్కువతో కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *