Home > Sports > హాకీకి మోక్షం ఎప్పుడు

హాకీకి మోక్షం ఎప్పుడు

పోకర్ స్పోర్ట్స్ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా విశ్వనాథ్ ఆనంద్
వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ టాప్
 
hockeyవసతులు వనరులు లేక అనేక క్రీడా సంస్థలు నీరుగారిపోతుంటే కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక కట్టడాలతో నిర్మితమైన రాష్ట్ర హాకీ అకాడమీ దిష్టిబొమ్మగా మారిందిరాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో తలపడే క్రీడాకారులకు మరింత ప్రావీణ్యం సాధించేలా తర్ఫీదు ఇవ్వడానికి రాష్ట్ర హాకీ అకాడమీ నిర్మాణానికి పులివెందులలో పునాదులు పడ్డాయి. కోట్ల రూపాయలు వెచ్చించి పులివెందుల పట్టణంలో 2012లో చేపట్టి 2014కు పూర్తి చేసింది. క్రీడాకారుల వసతికోసం రెండు కోట్ల రూపాయలతో ఒక చక్కటి భవనాన్ని ఆర్ అండ్ బీ అధ్వర్యంలో నిర్మించారు.  ఈ భవనాన్ని శాప్ అథారిటీకి అప్పగించాల్సి ఉన్న ఆ ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి శాప్ ముందుకు రావడం లేదు. దీంతో భవనం నిరుపయోగంగా మారి క్రమంగా శిథిలావస్థకు చేరుతుంది. సిబ్బంది కొరత, నిధుల కేటాయింపు లేకపోవటంతో శాప్ ముందుకు వచ్చేందుకు ఇట్టపడటం లేదు. దీంతో రాష్ట్ర హాకీ క్రీడాకారులు శిక్షణ లేక ఇతర క్రీడల వైపు మొగ్గు చూపుతున్నారు. హాకీలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్న క్రీడాకారులకు హాకీ అకాడమీ ఏర్పాటు చేయడంపై నిర్లక్ష్యంగా ఉండటం ఒక విధంగా శాపంగా భావిస్తున్నారు.అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా ఉన్న రాష్ట్ర హాకీ అకాడమీ పరిస్థి మెరుగు పరచాలని స్థానికులతో పాటు, క్రీడాకారులు కోరుతున్నారు. 
Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com