Home > Politics > రచ్చ గెలుస్తున్నాడు… మరి ఇంట సంగతేంటి

రచ్చ గెలుస్తున్నాడు… మరి ఇంట సంగతేంటి

మోత్కుపల్లిపై చర్యలకు అంతా రెడీ
తెలంగాణలో మాటలు కోటలు దాటుతున్నాయ్....

pawankalyan-janasena-apduniaసినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ యాత్ర ప్రారంభించాడు. కానీ చిరంజీవి గానీ మిగతా వారు గానీ ఆయన యాత్ర పై ఎలాంటి స్పందన చేయలేదు. ఫలితంగా ఇది పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. అందుకే ఇక లాభం లేదనుకున్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు-మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ స్పందించాడు. ఆయనతో పాటు…వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు పవన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. కానీ అల్లు అర్జున్ గానీ…నాగబాబు, చిరంజీవి, మిగతా వారు ఇంత వరకు స్పందించలేదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీఇప్పటిదాకా పవన్‌కు ఎందుకు విషెస్‌ చెప్పలేదనే చర్చ సాగుతోంది. పవన్ కు అల్లు అరవింద్ అంటే పడదనే వాదనుంది. ప్రజారాజ్యం జెండా పీకేయడానికి అల్లు అరవింద్ డబ్బుల కక్కుర్తినే కారణం అనే ప్రచారం ఉంది. కోట్ల రూపాయలు తీసుకుని సీట్లు అమ్ముకుని తన వద్ద పెట్టుకున్నాడని..ఫలితంగా పార్టీ పరువు పోయిందంటారు. చివరకు చిరంజీవి సొంత ఊళ్లోను ఓడిపోయాడు. ఇది ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం. తిరుపతిలో ఆయన పోటీ చేసి గెలవడంతో కాస్తంత ఊరట. కారణం ఏదైనా అధికార పార్టీలకు గులాం కొట్టేలా పవన్ తీరు కనిపిస్తోంది. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతల్లో ఏమి ఉండటం లేదు. ఏదో మీడియా ముందు నాలుగు మాటలు చెప్పడం తప్ప అతని వ్యూహంలో లోపం కనపడుతోంది. గతంలో కేసీఆర్ ను దారుణంగా తిట్టారు. వెంకయ్యనాయుడును పురుగును చూసినట్లు చూశాడు. జగన్ ను పనికిరాని వాడన్నాడు. టీడీపీ ఎంపీలు వ్యాపారాలు చేసుకోవడానికే పార్లమెంటుకు వెళుతున్నారని తిట్టాడు. ఇవన్నీ తెలిసో తెలియకో అన్న మాటలు. ఇప్పుడు అవే మాటలను ఉపసంహరించుకుంటున్నాడు. ఫలితంగా నేతలు ఎవరూ ఆయన్ను నమ్మడం లేదు. బలం ఉన్నచోటనే పోటీ చేస్తాను అని చెప్పాడు. ఈ మాటలు ముందుగానే కాడి కిందపడేసినట్లు అర్థమవుతోంది. ఓటుకు నోటు కేసు సున్నితమైన విషయం అన్నాడు. తప్పు జరిగితే ప్రశ్నించలేని వాడు అసలు రాజకీయ నాయకుడు కాదు. ఇలాంటి వాడు ఇక జనాలకు జనసేన ద్వారా ఏం చేస్తాడనే చర్చ సాగుతోంది. పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే దైర్యం, దమ్ము పవన్ ను లేవా అనే ప్రశ్న తలెత్తుతోంది. సరైనోడు చిత్రం బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అంటూ గతంలో అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఫలితంగా పీకే ఫ్యాన్స్‌కు దూరమయ్యాడు బన్నీ. ఇప్పుడు అదే బన్నీ నాకెందుకు అతను ఎక్కడకు పోతే అనేలా వ్యవహిస్తున్నాడు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకూడదు. కానీ మూడో పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ మిగతా వారికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ మధ్య పూనమ్ కౌర్ విషయంలోను పవన్ మౌనం పాటించాడు. తప్పు చేయక పోతే మౌనం పాటించడం ఎందుకు. మౌనం అర్థంగీకారం అంటారు. అందుకే పవన్ తప్పు చేశాడంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *