Home > Editorial > మహిళా నీకు వందనం

మహిళా నీకు వందనం

ఓ మహిళా నీకు వందనం
మొండి బకాయిలపై చర్యలకు సిద్ధం
 
saachi_apduniaమహిళ పురోగమిస్తోంది. కార్ల తయారీ రంగంలో పుణెకు చెందిన సాచి కందేకర్, హర్యానాకు చెందిన రాణిశర్మ, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంబికా హుడా నేవిగేటర్స్‌గా, రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఢిల్లీకి చెందిన రీతూ బియానీ, క్యాన్సర్ బాధితులకు అండగా ఇండియన్ క్యాన్సర్ సొసైటీని స్థాపించి మిథిలా బాల్సే, ఆర్మీలో ఫైటర్ పైలెట్స్‌గా ఎదిగిన మహిళలు నేడు ఎందరో కనిపిస్తున్నారు. మనదేశంలో గ్రామీణ మహిళల్లో 86శాతం వ్యవసాయ పనులపై ఆధారపడి బతుకుతున్నారు. పాడి పరిశ్రమలో 1.5 కోట్ల మంది పురుషులు పనిచేస్తుంటే 7.5 కోట్ల మంది మహిళలు పనిచేస్తున్నారు. ఫ్యాషన్‌రంగానికి వస్తే మహిళలదే హవా. మార్కెట్‌లో వస్తున్న కొత్త డిజైన్‌లు, రంగుల కలయికను అంచనా వేసి దుస్తులను తయారు చేసేది ఎక్కువగా మహిళలే. కాటన్, పట్టు దుస్తులపై మగువల మనసు హత్తుకునేలా సరికొత్త 
అందాలను ఆవిష్కరిస్తూ ఫ్యాషన్ డిజైనింగ్‌లో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు నేటి మహిళలు. శాస్త్రసాంకేతిక రంగంలో కూడా మహిళలే నేడు ముందుంటున్నారు. ఇటీవల ఇస్త్రో ఆకాశంలో పంపించిన 104 ఉపగ్రహ ప్రయోగంలో ఎనిమిది మంది మహిళా శాస్త్రవేత్తలు కీలకపాత్ర వహించిన సంగతి తెలిసిందే.మహిళలకు రాజకీయరంగంలో నేటివరకు సమానత్వం లభించలేదు. 1996లో 81వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు 20 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ చట్టరూపం దాల్చలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అధికారులు మారారు. కాని బిల్లులకు మోక్షం లభించలేదు. మహిళలకు రాజకీయ సమానత కల్పించే విషయాల్లో అన్నీ దేశాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంది. మహిళల రక్షణకోసం ప్రభుత్వం 498 ఎ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అదే విధంగా మహిళలకు 
మరో రక్షణ చట్టంగా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి రక్షణ చట్టాలపట్ల మహిళలు అవగాహన కల్పించుకుంటే తమ హక్కులను కొంతైనా కాపాడుకోవచ్చు.అనేక రంగాల్లో నేటి మహిళ పురోగమిస్తోంది. కార్ల తయారీ రంగంలో పుణెకు చెందిన సాచి కందేకర్, హర్యానాకు చెందిన రాణిశర్మ, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంబికా హుడా నేవిగేటర్స్‌గా, రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఢిల్లీకి చెందిన రీతూ బియానీ, క్యాన్సర్ బాధితులకు అండగా ఇండియన్ క్యాన్సర్ సొసైటీని స్థాపించి మిథిలా బాల్సే, ఆర్మీలో ఫైటర్ పైలెట్స్‌గా ఎదిగిన మహిళలు నేడు ఎందరో కనిపిస్తున్నారు. ఒరిస్సాకు చెందిన కల్పనాదాస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి పర్వతారోహణలో అందరికీ మార్గదర్శకురాలయ్యారు. హైదరాబాద్‌కు చెందిన సాజిదాఖాన్ తొలి ఆడియో మహిళా ఇంజనీర్‌గా, అగ్ని 6 మిస్సైల్స్ ప్రయోగంలో కీలకపాత్రను కేరళకు చెందిన టెస్సీ థామస్ పోషించారు.ఆసియాలోనే తొలి డీజిల్ ఇంజన్ రైలు నడిపిన తొలి మహిళగా ముంతాజ్ ఖాజీ, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఎన్నికైన తొలి మహిళగా 
స్మితా సబర్వాల్, అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మహిళగా కల్పనా చావ్లా పేరు తెచ్చుకున్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ విభాగాల్లో మహిళా అధికారులను నియమించేలా చేశారు. ఆటల్లో కూడా సానియా, సైనా నెహ్వాల్, మిథాలి, మేరికోవ్‌, సింధూ లాంటి వాళ్ళు విజయపతాకాన్ని ఎగురవేశారు. ఆర్థిక రంగంలోనూ మహిళల ప్రతిభాపాటవాలు ప్రస్ఫుటమయ్యాయి. ఎస్‌బిఐ తొలి చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తొలి మహిళా మేనెజింగ్ డైరైక్టర్‌గా చిత్రా రామకృష్ణన్, ఎల్‌ఐసి తొలి మహిళా మేనెజింగ్ డైరెక్టర్‌గా ఉషా సంగ్వా, యాక్సిస్ బ్యాంక్ తొలి ఎండి, సిఇఒ శిఖా శర్మ, ఐసిఐసిఐ ఎండిగా చందా కొచ్చర్ ఇలా ఎంతోమంది మహిళలు ఆర్థికరంగంలో తమదైన ముద్రను వేశారు.అమెరికాలో కూడా భారత సంతతి మహిళలు తమదైన రీతిలో ప్రగతిపథంలో పయనిస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో రాయబారిగా భారత సంతతికి చెందిన నిక్కీహేలీని అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీతా విలియవ్‌‌సు, మేరీలాండ్ డెలిగేట్‌గా 
అరుణ మిల్లర్, అమెరికా సెనెట్‌కు ఎంపికై కమలాహారీస్, ప్రమీలా ఇలా ఎందరో ఎన్నికై మహిళలు అన్నిరంగాల్లో పురోగమించగలరని నిరూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *