Home > Sports > హాకీలో గెలిచారు… క్రికట్ లో చిత్తయ్యారు…

హాకీలో గెలిచారు… క్రికట్ లో చిత్తయ్యారు…

ఓడినా పాకిస్థానీల మనసు గెలుచుకున్న కోహ్లీ
పాకిస్థాన్ విజయంపై కాశ్మీర్‌లో సంబరాలు

Hockey_APdunuaహాకీ ప్రపంచకప్ లీగ్‌లో పాకిస్థాన్‌ జట్టును భారత్ హాకీ జట్టు చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన భారత్ 7-1తో విజయ ఢంకా మోగించింది. అక్షదీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, తల్వీందర్ సింగ్ తలో రెండు గోల్స్ చేసి భారత్‌ని తిరుగులేని స్థితిలో నిలిపారు. 57వ నిమిషంలో పాక్ ఒక గోల్ చేసినా.. అప్పటికే ఆ జట్టుకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టోర్నీ తొలి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్‌ని ఓడించి శుభారంభం చేసిన భారత్.. శనివారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించింది. తాజాగా పాక్‌పై విజయం సాధించడంతో గ్రూప్-బిలో మూడు విజయాలతో పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్‌తో ఆదివారం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో భారత్‌పై 180 పరుగుల తేడాతో గెలుపొంది తొలిసారి టైటిల్‌ని చేజిక్కించుకుంది. ఓపెనర్ ఫకార్ జమాన్ (114: 106 బంతుల్లో 12×4, 3×6) శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ జట్టు ఘోరంగా విఫలమైంది. పేసర్ మహ్మద్ అమీర్ (3/16) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుని 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలిపోయింది. జట్టులో హార్దిక్ పాండ్య (76: 43 బంతుల్లో 4×4, 6×6) ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు.ఛేజింగ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ(0)ని తొలి ఓవర్‌లో.. కెప్టెన్ విరాట్ కోహ్లి(5)ని మూడో ఓవర్‌లో పెవిలియన్‌కి పంపి ఆదిలోనే మహ్మద్ అమీర్‌ భారత్‌ని దెబ్బతీశాడు. అనంతరం వచ్చిన యువరాజ్ సింగ్ (22: 31 బంతుల్లో 4×4)తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (21: 22 బంతుల్లో 4×4) కాసేపు నిలకడగా ఆడినా.. మళ్లీ ధావన్‌ని అమీర్ బుట్టలో వేసేయడంతో భారత్‌లో కంగారు మొదలైంది. బ్యాట్ ఝళిపించేందుకు ప్రయత్నించిన యువరాజ్ కూడా షదాబ్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోగా.. కేదార్ జాదవ్ (9), ధోని (4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో 72/6తో టీమిండియా ఓటమి దిశగా సాగింది. అయితే హిట్టర్ హార్దిక్ పాండ్య కళ్లు చెదిరే రీతిలో వరుస సిక్సర్లు బాదేయడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ.. జడేజాతో సమన్వయలోపం కారణంగా జట్టు స్కోరు 152 వద్ద పాండ్య రనౌటవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. చివర్లో జడేజా (15), అశ్విన్ (1), భువనేశ్వర్ కుమార్ (1 నాటౌట్), బుమ్రా (1) వరుసగా ఔటైపోయారు. పాక్ బౌలర్లలో అమీర్‌తో పాటు హసన్ అలీ మూడు వికెట్లు తీయగా.. షదాబ్ ఖాన్ రెండు, జునైద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com