Home > Politics > అవినాష్ వర్సెస్ షర్మిల

అవినాష్ వర్సెస్ షర్మిల

కోదండరామ్ పార్టీతో టిఆర్ఎస్ లో ఫుల్ ఖుషీ
బాబుకు పెరుగుతున్న మద్దతు

ys-avinash-reddy-apduniaకడప ఎంపీ సీటు నాకే కావాలంటోంది జగన్ సోదరి షర్మిల. ఆ సీటు మాకే ఇవ్వాలంటున్నారు మరోవైపు అవినాష్ రెడ్డి వర్గీయులు. ఫలితంగా ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తే ఎలా ఉండేదో. కానీ ఎక్కడా ఆమె పోటీ చేయలేదు. కానీ ఈ సారి ఆ అవకాశాన్ని వదులుకునేందుకు ఆమె సిద్దంగా లేదంటున్నారు. ఇప్పుడు అది జగన్ ఇంట్లో చిచ్చు పెడుతుందని తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారం మధ్య గొడవలు ప్రారంభమయ్యాయట. పార్టీలో ముందునుండి ఉన్న నేత తమ్మినేని సీతారం. ఆ తర్వాత వచ్చారు ధర్మాన. కానీ ఇద్దరికి అసలు పొసగడం లేదు. ఫలితంగా ఆ జిల్లా నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసించిన నేత ధర్మాన ప్రసాదరావు. తమ్మినేని సీతారం, రెడ్డి శాంతి వంటి నేతలకూ సొంత బలం, బలగం ఉన్నాయి. కానీ ఆముదాల వలస, పాతపట్నం మినహా మిగతా నియోజకవర్గాల్లో తన అనుచరులనే ఇంఛార్జ్‌లుగా పెట్టారు ధర్మాన. తమ్మినేని, రెడ్డి శాంతి నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోలేకపోతున్నారాయన. జిల్లాలో బలమైన కళింగ, కాపు సామాజిక వర్గాలకు చెందిన సీతారాం, రెడ్డిశాంతిలు ఒక వర్గంగా ఏర్పడటం ధర్మానకు ఇబ్బందిగా మారింది. ఆముదాల వలసకే పరిమితమైన తమ్మినేని సీతారాం శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ గా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ధర్మాన అనుచరులకు ఆయన చెక్‌ పెడుతున్నారు. టెక్కలి, పలాసలో నేతల గొడవలు ఎక్కువయ్యాయి. ఫలితంగా నేతలను పక్కన పెడుతున్నారు. గతంలో ఇలానే ఎవరికి వారే నేతలు వివాదాలతో పార్టీ పరువును బజారుకీడ్చారు. ఈ సారి అదే పరిస్థితి అయితే.. గెలుపు అంత తేలిక కాదన్నది నిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *