Home > Politics > జగన్ యాత్రలో పుల్కానే మెనూ

జగన్ యాత్రలో పుల్కానే మెనూ

నిధులు మళ్లింపు నిజం కాదు : సీఎం కేసీఆర్
నెల్లూరు కమలంలో కలవరం

ysjagan-apduniaపోకిరి సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు డైలాగ్ ఒకటుంది. తాను తీసుకెళ్లే టిఫిన్ బాక్స్ లో ఉప్మా తీసుకెళుతూ ఉంటోంది హీరోయిన్ ఇలియానా. రెండు, మూడు సార్లు దాన్ని చూసిన మహేష్ బాబు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినే బతికేస్తారా.. అని డైలాగ్ వేస్తాడు. ఇప్పుడు జగన్ కుటుంబం అంతే చేస్తుందట. అంతా ఇప్పుడు పుల్కాలు తినేసి ఉంటున్నారట. వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి తినే తిండి విషయంలో మార్పులు చేశాడు. అన్ని రకాల ఆహారం తినే జగన్ ఇప్పుడు సాధుజీవి తినే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఓ స్వామీజి చెప్పిన మాటలను ఆయన పాటిస్తున్నారట. మధ్యాహ్నం లంచ్ లో ఒకే ఒక పుల్కా, పప్పు, మూడు కూరలు మెనూలో ఉంటున్నాయి. నిర్వాహకులు భోజన విరామానికీ, విశ్రాంతికీ సమయం కేటాయించినా గత ఎనిమిది రోజుల్లో ఎన్నడూ ఆయన విశ్రమించలేదట. ఇక రాత్రి పూట భోజనం ఒక పుల్కా, కొంచెం ఎగ్‌ బుర్జీ, పప్పు, మరో కూరతో ముగిస్తున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కప్పు పాలు తాగుతారు. ఇదండీ జగన్ పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి తీసుకుంటున్న ఆహారం. బాగా తినకపోతే నడక సాగించడమే కష్టమని మిత్రులు చెబుతున్నా.. కాదంటున్నారట. అన్నం తింటే పిండి పదార్థాల శాతం పెరుగుతుందని.. ఫలితంగా ఇబ్బంది పడతానని భావిస్తున్నారట. అందుకే డైట్ ను పూర్తిగా మార్చారంటున్నారు. కొందరు వైద్య నిపుణులు మాత్రం.. ఇది మంచి ఆహారమేనని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com