Home > Politics > ఇంటికో ఉద్యోగం కాదు…ఊరుకో ఉద్యోగం రాలేదు : జగన్

ఇంటికో ఉద్యోగం కాదు…ఊరుకో ఉద్యోగం రాలేదు : జగన్

కర్నూలులోచంద్రబాబుకు గుడి
పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా : విజయశాంతి

ys-jagan-apduniaఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు 22సార్లు విదేశీ పర్యటనలు చేశారని, అయినప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా తీసుకురాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా సాధారణ విమానాల్లో కాకుండా ఖరీదైన ప్రైవేట్‌ విమానాల్లో చంద్రబాబు తిరిగారని, ఓ పక్క రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తన విదేశీ పర్యటనలకోసం కనీసం రూ.200 కోట్లు ప్రజాధనం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా, సుళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. నేటి రాజకీయ వ్యవస్థను మార్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ పేదవారు బతకాలంటే భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.’నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి వేలమంది నా అడుగులో అడుగు వేశారు. ఓ పక్క సమస్యలు చెబుతూనే నా భుజాన్ని తట్టి అంతా నాకు తోడుగా ఉన్నామంటూ అడుగులు వేస్తున్నారు. మీ ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు ముందుగా నా కృతజ్ఞతలు. మీరంతా నా వెంటే ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ప్రతిచోట క్రమం తప్పకుండా ప్రతి గ్రామంలో వినిపిస్తున్న సమస్య తాగునీటి సమస్య. అన్నా తాగడానికి కూడా నీళ్లు లేవని అంతా చెబుతుంటే చాలా బాధేస్తుంది. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారో అర్థం కావడంలేదు. రాష్ట్రంలో అత్యధికంగా వరి పంట పండే జిల్లా ఇది. ఇక్కడే సోమశిల ప్రాజెక్టు ఉంది. ఇదే జిల్లాలో లక్ష హెక్టార్లు వరి వేయాల్సి ఉండగా ఈసారి మాత్రం కేవలం 39 వేల ఎకరాలు మాత్రమే వేశారు. మన ఖర్మకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. దేవుడు కరుణించాడు కాబట్టి సోమశిలలో అంతంతమాత్రం నీళ్లున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *