Home > Politics > వైరాగ్యం… నైరాశ్యంలో జగన్

వైరాగ్యం… నైరాశ్యంలో జగన్

ఏపీ ఎంపీలకు జాతీయ మద్దతు
కమలం, ఫ్యాను మధ్యలో సైకిల్

ys jagan-apduniaఎందుకిలా జ‌రిగింది.. చేతికొచ్చిన అవ‌కాశాల‌న్నీ దూర‌మ‌వుతున్నాయి. ఎక్క‌డో లోపం ఉంది. ఎవ‌ర‌క్క‌డ‌.. ఏం జ‌రుగుతోంది.. చెప్పండ్రా బాబూ అని.. అధినేత జ‌గ‌న్ నెత్తీనోరు కొట్టుకుని అడుగుతున్నా.. నేత‌లెవ‌రూ నోరెత్త‌ట్లేద‌ట‌. వైరాగ్యం.. నైరాశ్యం.. జ‌గ‌న్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ‌ట‌. ఎందుకీ లొల్లి అంటే.. జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్పయాత్ర ఉద్దేశం ఒక్క‌టి కూడా నెర‌వేర‌ట్లేద‌ట‌. పైగా.. రివ‌ర్స్ స్వింగ్‌లో వెన‌క్కి రావ‌టం.. పార్టీకే చేటు తెచ్చేలా దాపురించ‌టంతో అధినేత‌కు ఏం చేయాలో పాలుపోకుండా ఉందంటూ.. పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. నాలుగేళ్ల‌యినా.. ప్ర‌తిప‌క్ష హోదాలో.. చేసింది శూన్యం. కేవ‌లం సీఎం కాలేద‌నే అక్కసు.. రేప‌టి ఆశ‌ను అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా బ‌య‌ట‌పెడుతున్న‌ వైనం ఇవ‌న్నీ జ‌నాల్లోకి సానుకూలంగా వెళ్తాయ‌నుకుంటే.. ప్ర‌తికూలంగా పోవ‌ట‌మే దీనంత‌టికీ కార‌ణం. రెండు నెల‌లుగా సాగుతున్న సంకల్ప యాత్ర‌కు జ‌న స‌మీక‌ర‌ణ‌కు.. స్థానిక నేత‌లు.. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్లు.. నానాతంటాలు ప‌డుతున్నార‌ట‌. పైగా.. ఎన్నిక‌ల్లో మీటింగ్‌కు సేక‌రించేంత‌టి జ‌నాన్ని స‌మీక‌రించ‌టంతో.. ఎన్నిక‌ల ముందుగానే ఎన్నిక‌లప్ప‌టి ఖ‌ర్చును మించుతుందంటున్నారు. పోన్లే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిస్తే.. అన్నీ రావా అనుకుంటూ.. అప్పులు చేసి మ‌రీ చేతులు కాల్చుకుంటున్న నేత‌లు ఉన్నార‌ట‌. ఓ నాయ‌కుడు.. ఏకంగా భార్య న‌గ‌ల‌న్నీ తాక‌ట్టుపెట్టి మ‌రీ.. జ‌నాల్ని అన్న యాత్ర‌కు తీసుకుపోయాడ‌ట. చివ‌ర్లో.. మెచ్చుకుంటాడ‌నుకున్న అన్న కాస్తా.. ఏంద‌బ్బీ.. జ‌నం ప‌ల‌చ‌గా ఉన్నారంటూ అనే స‌రికే.. మ‌నోడి ప్రాణాలు పైనే పోయాయ‌ట‌. ఇది తెలిసిన పొరుగు నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు.. మ‌న‌మేం చేయాల‌బ్బీ అంటూ.. తెగ ఫీల‌వుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు, ఓట్లు సంగ‌తి దేవుడెరుగు.. యాత్ర గండం గ‌డిచేదెలా అంటూ లెక్క‌లేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావ‌టం అంటే.. ఇదేనేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *