Home > Politics > అప్పడే ముగ్గురు అభ్య్ధర్థుల జాబితాతో వైసీపీ

అప్పడే ముగ్గురు అభ్య్ధర్థుల జాబితాతో వైసీపీ

అమరావతిలో అమృత వర్శిటీ
ప్రభుత్వ స్కూళ్లలో మంత్రుల పిల్లలు

ysrcp-apdunaiముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్. మొన్న పత్తికొండలో చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నిన్న కుప్పంలో చంద్రమౌళినే అభ్యర్థి అని చెప్పారు. నేడు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా హఫీజ్‌ ఖాన్‌ను ప్రకటించింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గం కర్నూలు. అందుకే ముందుగానే ప్రకటిస్తే బావుటుందనే ఆలోచనతోనే ఆపని చేశారంటున్నారు. ఇక్కడ రెండు సార్లు ముస్లిం వర్గానికి చెందిన సిపిఎం నేత ఎం.ఏ గఫూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి ఒకసారి, టిజి వెంకటేష్ రెండుసార్లు, తాజాగా ఎస్వీ మోహన్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. వైకాపా నుంచి గెలిచిన ఆయన భూమా నాగిరెడ్డి బావమరిది. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడు. మరోసారి అక్కడ నుంచే ఆయన పోటీ చేయాలని చూస్తున్నా…టిజి వెంకటేష్ కుమారుడు భరత్ నుంచి పోటీ వస్తోంది. టిజి వెంకటేష్ రాజ్యసభ్యుడుగా వెళ్లడంతో తన కుమారుడిని రాజకీయ రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి వెంకటేష్.50 వేలకు పైగా ముస్లిం ఓటర్లు ఉండటంతో కర్నూలు సీటును ముందుగానే ప్రకటించడం సాహసమే అని చెప్పాలి. కర్నూలు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి హాజరయ్యారు. అభ్యర్థిని ప్రకటించే ముందు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడారు నేతలు. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు హఫీజ్‌ ఖాన్‌ కు పార్టీ సహకారం అందించిందనే చెప్పాలి. మరోవైపు టీడీపీ నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి, టిజి భరత్ లలో ఎవరిని ప్రకటించినా మిగతా వారు సహకరించే పరిస్థితి లేదనే వాదనుంది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు ఉంది కర్నూలులో టీడీపీ పరిస్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com