Home > Politics > ఎమ్మెల్యే రోజా పాదయాత్ర…

ఎమ్మెల్యే రోజా పాదయాత్ర…

గురువుకు ప్రధమ స్థానం :వెంకయ్య నాయుడు
ఆర్కే‌నగర్ల లో మొత్తాన్ని ఆశిస్తోన్న ఓటర్లు!

ysrcp-mla-rojaగాలేరు-నగరి ప్రాజెక్ట్ పూర్తి కోసం వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తున్న రోజా ఇప్పుడు ఏకంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకు గాలేరు-నగరి ప్రాజెక్టును వేదికగా చేసుకొని తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం నుంచి నుంచి నాలుగు రోజులపాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర సాగనుంది.
గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ పాదయాత్ర చేపట్టినట్టు రోజా తెలిపారు. నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు పాదయాత్ర గా వెళ్లి స్వామి కి మొక్కులు చెల్లించుకునున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించి గాలేరు-నగరి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని రోజా కోరారు. కాగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ పాదయాత్ర అస్త్రంగా మారనుందని సమాచారం. పాదయాత్రలో భాగంగా పాల్గొననున్న వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, ధర్మాన ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com