Home > Politics > వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా….

వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా….

గర్భిణులకు వరంగా ప్రధానమంత్రి మాత వందన యోజన
కోదండరామ్ పార్టీతో టిఆర్ఎస్ లో ఫుల్ ఖుషీ

yssrcp-apduniaఏదో అనుకుంటే… ఇంకేదో జ‌రిగిందే.. ఇదేదో పాట కాదు. వైసీపీ నేత‌ల గంద‌ర గేయం. అదేనండీ.. గంద‌ర‌గోళం. ఎందుకిలా మా క‌ర్మ కాలిపోయిందంటూ పాడేసుకుంటున్నార‌ట‌. అధికారం సంగ‌తి ఎలా వున్నా.. అధినేత కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారా! అనేది ఇప్పుడున్న సంఘ‌ర్ష‌ణ‌. ఇటువంటి స‌మ‌యంలోనే.. న‌న్ను సీఎం చేయండి.. మీ సీట్లు.. మీవి. మా ఎంపీలు ఎంద‌రు గెలిచినా.. మీరెంత చెబితే అంతేనంటూ. అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. మోదీతో క‌మిట్ అయ్యారంటూ పార్టీలో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇదే విష‌యాన్ని అధికార టీడీపీ నేత‌లు కూడా బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. ప్లాన్ లో భాగంగానే.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో.. చంద్ర‌బాబుపై దుమ్మెత్తిపోసేలా ప్రేరేపించారంటున్నారు. జాతీయ‌స్థాయిలో అమిత్‌షా, జైట్లీ వంటి సీనియ‌ర్లు 2019లో తాము టీడీపీతో ఉంటామంటూ చెబుతుంటే.. ఏపీలో మాత్రం బీజేపీ నేత‌లు.. అందుకు భిన్నంగా స్నేహ‌ధ‌ర్మాన్ని వ‌దిలేసి.. విమ‌ర్శ‌ల‌కు దిగటం వెనుక‌.. వైసీపీ ప్రోధ్బ‌ల‌మే కార‌ణ‌మ‌నేది ఇప్పుడు తెలిసిపోయింది. పైగా.. ఈ మ‌ధ్య‌న ఓ ఆధ్యాత్మిక గురువు వ‌ద్ద వైపీసీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు క‌ల‌సి ఉండ‌టం కూడా.. అనుమానాల‌కు మ‌రింత బలాన్నిస్తోంది. అయితే.. ఇవ‌న్నీ రాజ‌కీయ వ్యూహంలో భాగంగా వైసీపీ.. ఆడిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కూ.. చంక‌లు గుద్దుకున్న పార్టీ సీనియ‌ర్లు.. ఇది ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు తీసుకెళ్లింద‌నే గుబులు మొద‌లైంది. అందుకే.. రాజ‌కీయం బాగానే వున్నా.. అనుకోకుండా చేతులు కాల్చుకున్నామ‌నే భ‌యానికి వ‌చ్చారు. అందుకే.. దీన్నుంచి.. అంతా తూచ్ అంటూ.. ఏపీ జ‌నాన్ని న‌మ్మించేందుకు మ‌రో కొత్త‌నాటకానికి తెర‌లేపే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారంటూ.. టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. దానిలో భాగ‌మే.. ఈనెల 8న బంద్‌కు పిలుపునివ్వ‌టం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏదైనా.. వ్యూహ‌క‌ర్త‌.. వేసే ఎత్తులు.. లాభాన్నివ్వాల్సింది.. త‌మ అధినేత ఎత్తులు.. త‌మ‌కు కొత్త చిక్కులు తెస్తున్నాయంటూ.. వైసీపీ శ్రేణులు గుస‌గుస‌లాడుకుంటున్నాయ‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *