Home > World News > యూసఫ్ షా అంతర్జాతీయ ఉగ్రవాదే

యూసఫ్ షా అంతర్జాతీయ ఉగ్రవాదే

ట్రంప్ కు అపురూప కానుక ఇచ్చిన మోడీ
అమెరికా పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ

yusaf_apduniaఉగ్రవాదన్ని వెనకేసుకొస్తున్న పాకిస్థాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ అండతో భారత్ లో ఉగ్రదాడులు చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ అలియాస్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ షాను  అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అమెరికా. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్ కు ముందే ఆ దేశ స్టేట్ డిపార్ట్ మెంట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ స్టేట్ మెంట్ మొత్తం అమెరికన్ కాంటెక్ట్స్ లోనే ఉంది. యూఎస్ పౌరులు, ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ, ఆర్థిక వ్యవస్థకు అపాయం కలిగించేటట్టు సయ్యద్ చర్యలున్నయని తెలిపింది స్టేట్ డిపార్ట్ మెంట్. అమెరికా చర్యను భారత్ స్వాగతించింది. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలాకాలంగా భారత్ అనుసరిస్తున్న విధానానికి ఇది వాస్తవిక, ఆమోదయోగ్యమైన చర్య అన్నది విదేశాంగ శాఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *