Home > General > పిడుగులతో జరా భద్రం

పిడుగులతో జరా భద్రం

రికార్డులకే పరిమితమవుతున్న హైద్రాబాద్ మెట్రో
తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

pidugu_apduniaవర్షకాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పుడు పిడుగులు పడుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తినష్టం కూడ సంభవిస్తోంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి జిల్లాలలో వర్షంతో పాటు పిడుగులు పడుతున్నాయి.పిడుగులతో కూడిన వర్షం ప్రజలను భయాభ్రంతులకు గురిచేస్తుంది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్‌లో గత శుక్రవారం పిడుగుపాటు ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈదన్న, పరమేష్, లక్ష్మన్న అనే వ్యవసాయ కూలీలు మరికొందరితో కలిసి వర్షం పడుతున్నప్పుడు పొలం వద్దకు వెళ్లగా వారిపై పిడుగు పడి మృతి చెందారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి రెండు ఎద్దులు మృతి చెందాయి. పిడుగుపాటుకు
మనుషులు, పశువులు మృతి చెందుతుండటంతో ప్రజలు అందోళనకు గురవుతున్నారు. పిడుగులతో జాగ్రత్తగా ఉండాలని వాతవరణ నిపుణులు సూచిస్తున్నారు.మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. ఒక్కోసారి విద్యుత్‌ధావేశంలో పేరుకుపోయిన మేఘాల సమీపంలో వ్యతిరేక విద్యుతాధావేశ మేఘాలు ఉన్నప్పడు వాతావరణంలో తేమ, దుమ్ము బాగా ఉండే వాటిలోని స్థిర విద్యుత్ భూమివైపుకు ప్రవహిస్తుంది. ఒక మిల్లీ సెకన్ కాలంలో మెరుపులతో కూడిన పిడుగులో 20 వేల ఆంపియర్ల విద్యుత్ ప్రవాహం పుడుతుంది. అప్పడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటర్‌కు రెండు లక్షల ఓల్ట్‌లు ఉంటుంది. ఆకాశం నుంచి భూమి వైపుకు దూసుకు వచ్చే పిడుగుల నుంచి చెట్లు, భవనాలు, ఖాళీ ప్రదేశాలలో పడి సందర్భంలో విద్యుత్ ప్రవాహం జరిగే అవకాశముంది. పిడుగు పాటుకు చెట్లు కాలిపోవడం, భవనాలు దెబ్బ తింటాయి. అదే పిడుగులు మనుషులు మీద పడితే విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందుతారు.మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతాయి. ప్రధానంగా చెట్ల మీద పిడుగులు అధికంగా పడుతాయి.
అందుకే వర్షం పడేటపుడు చెట్ల కింద నిలబడవద్దని పెద్దలు చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో పిడుగులు భవనాల మీద కూడా పడుతాయి. అందువలన భవనాలపై పిడుగులు పడకుండా రక్షణ కడ్డీలు (లైటనింగ్ రాడ్స్) ఏర్పాటు చేసుకోవాలి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసినప్పుడు ఇళ్లలోని విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశముంది. ఆ సమయంలో ఇంట్లోని టీవీలకు ఉన్న కరెంట్ ప్లగ్‌లు, కేబుళ్లు తీసి వేయాలి. లేదంటే అందులోకి విద్యుత్ ప్రవాహించి కాలిపోయే ప్రమాదం ఉంది. అలాగే వర్షం పడినప్పుడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టపక్కల, కరెంట్ తీగల కింద నిలబడకూడదు. ఎర్తింగ్‌తో కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు చెప్పులు ధరించకుండా బయటకు రాకూడదు. పిడుగులు పడినప్పుడు వెలువడే భారీ శబ్ధాలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ప్రమాదకరంగా పరిణమిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com